: సమస్యలు పరిష్కారం కావాలంటే రైతు సంఘాలు ఏకం కావాలి: కోదండరాం
రైతు సమస్యలు పరిష్కారం కావాలంటే విభేదాలను పక్కనపెట్టి రైతు సంఘాలన్నీ ఏకం కావాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాదు, బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన రైతు సంఘాల భేటీలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలు పరిష్కారమవ్వాలంటే, మేధావులు, రైతు సంఘాలు కలిసి పనిచేయాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే రైతులు సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ సంక్షోభం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల కుటుంబాలతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, రైతులు ఎంత మంది సంఘటితమవగలరో ప్రభుత్వానికి చూపించాలని ఆయన రైతులకు సూచించారు.