: మీడియాకు, మేధావులకు అర్ధం కావడంలేదు: విజయవాడ కమిషనర్


'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారని విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సామాన్యులకు అర్థమైన విషయం మేధావులు, జర్నలిస్టులకు అర్థం కావడం లేదని అన్నారు. శ్రీలంకలో ట్రాఫిక్ పై ఉన్న అవగాహన, విజయవాడలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీభాయి గురించి పాఠాలున్నాయి కానీ, రోడ్డుమీద ఎలా వ్యవహరించాలో నేర్పరని ఆయన మండిపడ్డారు. విద్య ఉపయోగపడేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బెజవాడలో అర్ధరాత్రి అసాంఘిక శక్తుల ఆట కట్టించే ప్రయత్నంలో భాగంగా 'ఆపరేషన్ నైట్ డామినేషన్'ను తీసుకువస్తే, దానికి లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News