: పాతసామాను అని తెరిస్తే...ప్రాణం తీసింది
అసోంలోని గౌహతి సమీపంలోని ఓ గ్రామంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఉదలగురి జిల్లాలోని బోర్జాహర్ గ్రామంలో రామ్ చంద్ర బర్మాన్ పాతసామాన్ల డీలర్ గా వ్యాపారం చేసుకుంటున్నాడు. తాను సేకరించిన పాత వస్తువుల్లో ఓ బాక్స్ లాంటిదాన్ని గుర్తించిన రామ్ చంద్ర దానిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. సుత్తి దానిపై పడిన వెంటనే అది భారీ శబ్దంతో విస్ఫోటనం చెందింది. దీంతో రామ్ చంద్ర మృత్యువాతపడగా, ఇంట్లోని వారు ముగ్గురు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.