: విశాఖలో హత్యల కలకలం


ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన రెండు హత్యలు విశాఖ జిల్లాలో కలకలం రేపాయి. జిల్లా పరిధిలోని కోటఊరుట్ల మండలంలో వేర్వేరు గ్రామాల్లో ఈ హత్యలు జరుగగా, ఒక వివాహిత మహిళ, ఒక పురుషుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చౌడువారి గ్రామానికి చెందిన చిలిపినాయుడు (40)ని గుర్తుతెలియని దుండగులు తలపై మోది హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఇంకో ఘటనలో బీసీ కాలనీకి చెందిన వివాహిత మహిళ పప్పుదేవి హత్యకు గురైంది. ఆమె మృతదేహం గ్రామానికి దగ్గరలోని పొలాల్లో చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News