: పోలీసుల అదుపులో పారిపోయిన ఎర్ర దొంగలు!


శేషాచలం అడవుల్లో వారం క్రితం పోలీసు కాల్పుల నుంచి తప్పించుకున్న ఎర్రచందనం దొంగల్లో కొందరు ఈ ఉదయం పోలీసులకు పట్టుబడ్డారు. కడప జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో టాస్క్‌ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి, 41 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వీరిలో శేషాచలం ఎదురుకాల్పుల్లో తప్పించుకొని పరారైన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళం తెలియని టాస్క్‌ ఫోర్స్ పోలీసులు నిందితులను ప్రశ్నించేందుకు నెల్లూరు పోలీసు అధికారుల సాయం తీసుకుంటున్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News