: అడ్డంగా దొరికిన మందుబాబుల్లో పలువురు ప్రముఖులు!


గత రాత్రి హైదరాబాదులోని పలు కూడళ్ళలో ట్రాఫిక్ పోలీసులు జరిపిన 'డ్రంకెన్ డ్రైవ్'లో 180 మంది దొరికిపోయారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, మలక్ పేట, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి పోలీసులు తనిఖీలు జరిపారు. పరిమితికి మించి మద్యం సేవించిన వారి వాహనాలు సీజ్ చేసి కేసులు పెట్టినట్టు పోలీసులు వివరించారు. 180 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరికి సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ తనిఖీల్లో పట్టుబడినవారిలో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News