: అడుక్కునే రోజులు పోయాయి: మోదీ


ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఉండాలని మోదీ తన వాదన బలంగా వినిపించారు. ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు విస్తరించాలంటే భారత్ వంటి దేశాలకు శాశ్వత స్థానం కావాలని ఆయన అన్నారు. ఐరాసలో శాశ్వత సభ్యత్వం భారత హక్కుగా మోదీ అభివర్ణించారు. "ఇండియా అడుక్కునే రోజులు పోయాయి. మా హక్కులను మేము డిమాండ్ చేస్తున్నాం. బుద్ధ భగవానుడు, మహాత్మా గాంధీ నడయాడిన భారత భూమికి భద్రతా మండలిలో స్థానం ఇవ్వాలని కోరుతున్నా" అన్నారు. ఇండియా శాంతిని కాంక్షించే దేశమని తెలిపారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో 14 లక్షల మంది భారత సైన్యం పాల్గొన్నప్పటికీ వారు ఇతరదేశాల కోసం పోరాడారని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News