: విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పిన గేల్


తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు, లేదంటే, పిచ్ మందకొడిగా ఉండి బ్యాటింగ్ కు సహకరిస్తున్న సమయంలో మాత్రమే క్రిస్ గేల్ రెచ్చిపోతాడని, ఛేదనలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆడిన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా లేదని వస్తున్న విమర్శలకు సమాధానం లభించింది. ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా పై జరిగిన పోరులో ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గేల్ త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నప్పటికీ జట్టుకు విజయాన్ని అందించాడు. కోహ్లీ, డివిలియర్స్ సహా సహచరులంతా తక్కువ స్కోర్ కే అవుట్ కాగా, జట్టు విజయ బాధ్యతలు భుజాన వేసుకొని చివరి వరకూ పోరాడాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్ ల సాయంతో 96 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై విజయం సాధించింది.

  • Loading...

More Telugu News