: ధాటిగా ఆడిన రస్సెల్...కోల్ కతా 177/6


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా కోల్ కతాలో జరుగుతున్న మ్యాచ్ లో నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప (35), గౌతమ్ గంభీర్ (58) జోడీ శుభారంభం ఇవ్వడంతో తొలి ఆరు ఓవర్లలోనే 53 పరుగులు చేసి సత్తా చాటింది. అనంతరం బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ ఊతప్ప, గంభీర్ నెమ్మదిగా స్కోరుబోర్డును ముందుకు ఉరికించారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో నెమ్మదించిన స్కోరు బోర్డును రస్సెల్ ఉరకలెత్తించాడు. కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. మనీష్ పాండే (23), సూర్యకుమార్ యాదవ్ (11) కుదురుకున్నట్టు కనిపించినా, భారీ స్కోరు నమోదు చేయలేకపోవడం విశేషం. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో పటేల్, వరుణ్ ఆరోన్, అహ్మద్, చాహల్ తలో వికెట్ తీశారు. 178 పరుగుల విజయ లక్ష్యంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News