: నేనిలా ఉండడానికి కారణం మంచు ఫ్యామిలీనే!: తమన్నా
మంచు లక్ష్మి నెంబర్ తన ఫోన్ లో సేవ్ చేసి ఉండదని, అయితే ఆమె గొంతు వినగానే గుర్తు పట్టేస్తానని, మంచు లక్ష్మి అంత ప్రత్యేకమైనదని తమన్నా చెప్పింది. దొంగాట ఆడియో వేడుకలో తమ్మూ మాట్లాడుతూ, తానీరోజు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నానంటే కారణం మంచు కుటుంబమేనని పేర్కొంది. పదిహేనేళ్ల వయసులో తనను తెలుగు తెరకు మంచు మోహన్ బాబు గారు పరిచయం చేశారని చెప్పింది. దానికి కృతజ్ఞతగానే తాను వేదికపై నిలబడ్డానని మిల్కీబ్యూటీ తెలిపింది. మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ అని తమన్నా చెప్పింది. నిర్మాత, నటి, సింగర్ గా అభిమానులను అలరిస్తోందని తమన్నా ప్రశంసించింది.