: ఈసారి పద్మ పురస్కారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శరద్ యాదవ్


దక్షిణాది మహిళల శరీర రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అపఖ్యాతి మూటగట్టుకున్న జేడీయూ అధినేత శరద్ యాదవ్ ఈసారి పద్మశ్రీ పురస్కారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీనియర్ సామాజిక వేత్త సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నిజాయతీ లేనివారికి (బే ఇమాన్), అధికారుల అండదండలు ఉన్నవారికి మాత్రమే పద్మ పురస్కారాలు దక్కుతున్నాయని మండిపడ్డారు. సాంఘిక వాదులంతా పద్మ పురస్కారాల్ని విసిరికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పద్మ పురస్కారాలకు ఎంపికైనవారి జాబితా పరికిస్తే అందులో రైతులు, ఆదివాసీలు, దళితులు మచ్చుకైనా కనపడరని ఆయన అన్నారు. అర్హులకు ఇవి దక్కవు కనుక, వారికి దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు. గడిచిన 68 ఏళ్లుగా ఈ తంతు జరుగుతోందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News