: ఆ యాప్ తో జాగ్రత్తగా ఉండండి: ఆర్బీఐ హెచ్చరిక
''మీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి'' అంటూ ఓ యాప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ యాప్ పై ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్ ప్రకటన చూసి డౌన్ లోడ్ చేసుకుంటే నిండా మునిగే ప్రమాదం ఉందని, మీ అకౌంట్లోని డబ్బంతా మాయమయ్యే ప్రమాదం ఉందని ఆర్బీఐ చెబుతోంది. ఈ యాప్ పక్కా మోసపూరిత యాప్ అని రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేస్తోంది. బ్యాంక్ బ్యాలెన్స్ తెలసుకునేందుకు ప్రత్యేకంగా ఎలాంటి యాప్ ను తాము రూపొందించలేదని, కొందరు హ్యాకర్లు ఆర్బీఐ లోగోను అక్రమంగా వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి స్పందించొద్దని బ్యాంకు ప్రజలను అప్రమత్తం చేసింది.