: మంచు మ్యూజిక్ లోగో లాంఛ్ చేసిన రాఘవేంద్రరావు


మంచు మ్యూజిక్ లోగోను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు లాంఛ్ చేశారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన 'దొంగాట' ఆడియో వేడుకలో అరియానా, వివియానా, నిర్వాణతో కలిసి రాఘవేంద్రరావు లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత వరకు మంచి దొంగగా ఉన్న మంచు లక్ష్మి, దొంగాట లక్ష్మిగా మారనుందని అన్నారు. స్టార్ హీరోలందరినీ పోస్టర్ లో పెట్టేసుకున్న లక్ష్మి, తెలుగు సినిమాల్లో వచ్చే మంచి పాటలను విడుదల చేయాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. డిజిటల్ మ్యూజిక్ లోగోను కూడా ఆయన ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News