: ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన గౌతీ, ఊతప్ప
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్ కతా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనింగ్ జోడీ గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో గౌతమ్ గంభీర్ (14), రాబిన్ ఊతప్ప (14) కొనసాగుతున్నారు.