: శుభారంభం బాగుంది...నా ఆటా బాగుంది: మెక్ కల్లమ్


శుభారంభం జట్టుకు ఆనందం కలిగిస్తోందని సెంచరీ వీరుడు బ్రెండన్ మెక్ కల్లమ్ తెలిపాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టోర్నీని రెండు విజయాలతో ఆరంభించడం శుభసూచకమని అన్నాడు. టోర్నీలో తన ఆటతీరుపై సంతృప్తిని వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ ఫాంను కొనసాగించడం ఆనందంగా ఉందని మెక్ కల్లమ్ తెలిపాడు. టోర్నీ మొత్తం ఇదే ఫాం కొనసాగించాలని ఉందని, ప్రపంచ స్థాయి బౌలర్లు కలిగిన సన్ రైజర్స్ ను సమర్థవంతంగా అడ్డుకోవడం ఆనందం కలిగించిందని ఆయన వెల్లడించాడు. పొట్టి ఫార్మాట్ లో సెంచరీ ఎవరికైనా ఆనందమిస్తుందని మెక్ కల్లమ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News