: గవర్నమెంట్ జాబ్ లపై ఎస్ఎంఎస్ లిస్తాం: ఘంటా చక్రపాణి
ప్రభుత్వోద్యోగాల ప్రకటనలను నిరుద్యోగులకు ఎస్ఎంఎస్ ల రూపంలో ఇస్తామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. టీఎస్పీఎస్సీ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఎస్సీపీఎస్సీ వెబ్ సైట్ ను పలురాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లు పరిశీలించాకే రూపొందించామని అన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాచరణకు వెబ్ సైట్ అద్దంపడుతుందని ఆయన చెప్పారు. కేరళ తరహాలో టీఎస్సీపీఎస్సీ అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని చేపడుతుందని అన్నారు. నిరుద్యోగులు ఒక్కసారి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పంపిస్తామని ఆయన చెప్పారు.