: విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు పెట్టలేదు?: వెంకయ్యనాయుడు
పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎందుకు పేర్కొనలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామంలో జాతీయ కస్టమ్స్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని బీజేపీ నెరవేరుస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలనలో దేశాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేసిందని, అందులో భాగంగానే రాష్ట్రాన్ని విభజించిందని ఆయన మండిపడ్డారు.