: తెలంగాణ ఉన్నత విద్యా మండలి లోగో ఆవిష్కరించిన గవర్నర్
తెలంగాణ ఉన్నత విద్యా మండలి లోగోను రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఇదే సమయంలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనలో ఉన్నత విద్యా మండలిదే కీలక పాత్ర అని అన్నారు. తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, తెలంగాణ ఉన్నత విద్యా మండలి పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. అంతేగాక ఉద్యోగ నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ ను రూపొందించి దానిని వెబ్ సైట్ లో పెట్టాలని ఆయన చెప్పారు. నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను రాష్ట్రం బయట తయారు చేయించాలన్నారు.