: బంతులు బౌండరీలు దాటాయి...తొలి సెంచరీ మెక్ కల్లమ్ ఖాతాలోకే!


బంతులు బౌండరీలు దాటేశాయి. సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లను చెన్నై బ్యాట్స్ మన్ ఆటాడుకున్నారు. బౌలర్ ఇషాంత్, కరణ్ శర్మ, పర్వేజ్ రసూల్, భువనేశ్వర్, బొపారా, స్టెయిన్, బౌల్ట్ అని తేడా చూపలేదు. టీ20లో మజాను చూపుతూ చెన్నై బ్యాట్స్ మన్ రెచ్చిపోయారు. వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీ దాటించి టోర్నీలో అత్యధిక స్కోరు నమోదు చేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ కేవలం 56 బంతుల్లోనే ఐపీఎల్-8లో తొలి సెంచరీ నమోదు చేయడం విశేషం. టాస్ గెలిచి భారీ స్కొరు లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి మెక్ కల్లమ్ (100), స్మిత్ (27) శుభారంభం ఇచ్చారు. మెక్ కల్లమ్ చెలరేగిపోయి ఆడితే స్మిత్ జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో స్మిత్ రన్ అవుట్ గా వెనుదిరగడంతో, రైనా (14) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి, రనౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ (53) బౌలర్లను ఆటాడుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. స్కోరును చూసిన అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాదు విజయం సాధించడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News