: అనంతపురం జిల్లా అభివృద్ధికి అనుకూలంగా ఉంది: అరుణ్ జైట్లీ
అనంతపురం జిల్లా బెంగళూరుకు దగ్గరగా ఉండడంతో అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామంలో ఏర్పాటు చేయనున్న జాతీయ కస్టమ్స్ అకాడమీ శంకుస్థాపనకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కస్టమ్స్ అకాడమీ కోసం కేవలం 9 నెలల్లో 900 ఎకరాల భూమి సేకరించడం ఏపీ సీఎం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.