: చెన్నైలో మెక్ 'కల్లోలం'...చెన్నై 119/1


సన్ రైజర్స్ హైదరాబాదు ఆరంభం పేలవంగా సాగుతోంది. బౌలింగే బలంగా ఐపీఎల్ లో అడుగుపెట్టిన రాజస్థాన్ పంజాబ్ పై విజయం సాధించడంతో చెన్నైని హైదరాబాదు కూడా మట్టికరిపిస్తుందని అభిమానులు ఆశించారు. అభిమానుల అంచనాలను తల్లకిందులు చేస్తూ చెన్నై జట్టు చిదంబరం స్టేడియాన్ని పరుగుల వర్షంతో తడిపేస్తోంది. ఓవర్ కి 9 పరుగుల చొప్పున చెన్నై బ్యాట్స్ మన్ సాధిస్తున్నారు. దీంతో ఎనిమిది ఓవర్లలో చెన్నై 75 పరుగులు సాధించింది. డ్వేన్ స్మిత్ (27) రనౌట్ గా వెనుదిరగడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి కేవలం ఒక వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. మెక్ కల్లమ్ 41 బంతుల్లో 66 పరుగులు చేయగా, సురేష్ రైనా 9 బంతుల్లో 12 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News