: భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు: అమిత్ షా


భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూకుంభకోణంలో చిక్కుకున్నారని అన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న భూసేకరణ బిల్లు వల్ల రైతులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. భూసేకరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News