: పాకిస్థాన్ బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తిస్తోంది: మండిపడ్డ ఇజ్రాయెల్


పాకిస్థాన్ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తోందని ఇజ్రాయెల్ మండిపడింది. ఎప్పటి నుంచో ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్న ఇజ్రయెల్ కు దాని పర్యవసానాలు బాగా తెలుసు. దానికి తోడు ఇజ్రాయేలీయులు లక్ష్యంగా ముంబై పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీని విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారిని ఎలా విడుదల చేస్తారని ఇజ్రాయిెల్ ప్రశ్నించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News