: మతిమరుపుకు విరుగుడు


మీరు పాలు తాగుతారా? గుడ్లు, చేపలు ఇష్టంగా తింటారా? అయితే మీకు మతిమరుపు రాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు మీ జ్ఞాపకాలను ఎంతో కాలం గుర్తుంచుకోవచ్చని వారు అంటున్నారు. 

వృద్ధాప్యంలో కొందరికి వచ్చే మతిమరుపు (అల్జీమర్స్) వ్యాధి వారితో పాటు, కుటుంబసభ్యులకు కూడా సమస్యగా పరిణమిస్తుంది. దీని బారిన పడకుండా ఉండేందుకు పాలు, గుడ్లు, చేపల వంటి కొవ్వు ఆమ్లాలు (విటమిన్ డీ-3, ఒమేగా-3) ఉన్న ఆహరం తీసుకోవాలని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం  శాస్త్రవేత్తలు  సూచిస్తున్నారు.

ఇవి మన 
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని వారు తెలిపారు. పోషకాహారం అందించడం ద్వారా మతిమరుపుకు కారణమయ్యే అమైలాయిడ్ ప్లాక్ ను ఎదుర్కోవచ్చంటూ శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 

  • Loading...

More Telugu News