: ఖమ్మం చేరుకున్న నారా లోకేశ్ ... పరామర్శ యాత్ర ప్రారంభం
టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ పరామర్శ యాత్ర నేటి ఉదయం ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఆయన నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం ఖమ్మం చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. నేటి యాత్రలో భాగంగా లోకేశ్ అశ్వాపురంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. బ్రహ్మయ్య తండ్రి పుల్లయ్య పది రోజుల క్రితం మరణించారు. అలాగే, వివిధ ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందించేందుకు లోకేశ్ పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టారు.