: రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత షూటర్
భారతీయ మహిళా షూటర్ అపూర్వి చండేలా రియో ఒలింపిక్స్ కు ఎంపికైంది. కొరియాలోని చాంగ్వాన్ లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎ వరల్డ్ కప్ (రైఫిల్ లేదా పిస్టల్) లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దాంతో వచ్చే సంవత్సరం రియో డి జనీరోలో జరగనున్న ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించింది. షూటర్ జీతు రాయ్ తరువాత భారత్ నుంచి ఒలింపిక్స్ కు ఎంపికైన రెండవ షూటర్ చండేలానే!