: బాసర అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్
బాసర సరస్వతీ అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పూర్ణ కుంభంతో ఆలయ పూజారులు, అధికారులు, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నలు స్వాగతం పలికారు. తరువాత గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసరలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వెలమ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.