: అమీర్ ఖాన్ ను కంటతడిపెట్టించిన ‘మార్గరిటా విత్ ఏ స్ట్రా’
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, ఇటీవలి తన చిత్రం 'పీకే' క్లైమాక్స్ లో తాను కంటతడి పెడుతూ ప్రేక్షకులను కంటిమీద రెప్ప వాల్చకుండా కట్టిపడేశాడు. తాజాగా ఓ చిత్రాన్ని చూసిన అతడు ఉబికివస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ‘మార్గరిటా విత్ ఏ స్ట్రా’ చిత్రాన్ని చూసిన అమీర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయట. భార్య కిరణ్ రావు బలవంతం మీద చిత్రాన్ని చూసిన అమీర్ ఆ చిత్ర సన్నివేశాలకు కంటతడి పెట్టకుండా ఆపుకోలేకపోయాడు. అనంతరం సినిమా బాగుందని అతడు కితాబిచ్చాడు. ‘సెరబ్రల్ పాల్సీ’ వ్యాధితో బాధపడుతున్న రోగి పాత్రలో కొత్త నటి కల్కి కోయిచిలిన్ నటించింది. చిత్రంలో తన నటనకు అమీర్ మంత్రముగ్ధులయ్యారని కల్కి పొంగిపోయింది.