: నల్లకుంటలో సీఎం కేసీఆర్... ఫీవర్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయన నేరుగా నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చారు. వచ్చీరావడంతోనే ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరు శాతం, రోగులకు అందుతున్న చికిత్స, ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు తదితరాలను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఆయన ఫీవర్ ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్నారు.