: జర్మనీ పర్యటనలో మోదీని కలవనున్న నేతాజీ కుటుంబ సభ్యులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు జర్మనీ పర్యటనలో రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న ఆయన రేపు జర్మనీ చేరుకుంటారు. బోస్ కుటుంబ సభ్యులపై నాడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం 20 ఏళ్ల పాటు నిఘా ఉంచినట్టు తాజాగా ఐబీ ఫైళ్ల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో వారు మోదీతో ఈ విషయంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అటు బెర్లిన్ లో భారతీయ ప్రవాసుల ప్రత్యేక కార్యక్రమంలో బోస్ మేనల్లుడు సూర్య (హాంబర్గ్ లో ఇండో-జర్మన్ అసోసియేషన్ అధ్యక్షుడు) కూడా ప్రధానిని కలిసే అవకాశం ఉందని సమాచారం.