: ధర్నాలో సొమ్మసిల్లిన రోజా... ఆస్పత్రికి తరలించిన వైసీపీ నేతలు
చిత్తూరు జిల్లా పుత్తూరులో నేటి ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతోంది. నిన్న జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా, స్థానిక టీడీపీ నేతలు పోటాపోటీ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోజా ఒక్కసారిగా క్రింద పడిపోయారు. నిన్నటి నుంచి అధికారపక్ష నేతలతో వాగ్వాదానికి దిగిన ఆమె, నేటి ఉదయం కూడా పుత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ఆమె సొమ్మసిల్లిపడిపోయారు. వెనువెంటనే స్పందించిన వైసీపీ నేతలు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.