: పుత్తూరులో హైటెన్షన్... రోజా, టీడీపీ నేతల పోటాపోటీ నిరసనలు!
చిత్తూరు జిల్లా పుత్తూరులో కొద్దిసేపటి క్రితం మొదలైన నిరసనల పర్వం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పట్టణంలోని పోలీస్ స్టేషన్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో తనపై అకారణంగా కేసులు బనాయిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న టీడీపీ నేతలు, రోజాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దళితులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన రోజాను తక్షణమే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల నిరసనలతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.