: ఆ నలుగురి చేతుల్లో 4 కోట్ల మంది నలిగిపోతున్నారు: టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజలు ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతున్నారని టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయినా ఆ నలుగురు ఎవరంటే, సీఎం కేసీఆర్, అల్లుడు హరీశ్ రావు, కొడుకు కేటీఆర్, కూతురు కవితలట! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా, తెలంగాణ ప్రజల ప్రభుత్వం రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ నలుగురికి నచ్చిన విధంగానే రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆరోపించారు. అప్పుల బాధతో రైతులు పిట్టల్లా రాలిపోతున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల హక్కులను పణంగా పెట్టి కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యారని ఆయన ఆరోపించారు.