: మండుటెండలో గ్రానైట్ రాళ్లపై పడుకోబెట్టి... విశాఖలో పోలీసు మార్క్ శిక్షలు!


శిక్షల అమలుకు మనం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. తప్పు చేసే వారిని పట్టుకురావడం పోలీసుల బాధ్యత కాగా, శిక్షలు వేసే బాధ్యతను కోర్టులకు కట్టబెట్టాం. మరి తప్పు చేసే వారిని పట్టుకురావడంతో పాటు శిక్షలు అమలు చేసే బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తే... నిన్న విశాఖలో జరిగినట్టే జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది? బీచ్ లో స్నానానికి దిగిన యువకులను అక్కడి పోలీసులు మండుటెండలో సలసల కాలుతున్న గ్రానైట్ రాళ్లపై చొక్కాలు లేకుండా పడుకోబెట్టారు. సముద్రంలో స్నానానికి వెళుతున్న యువత మృత్యువాత పడుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ తరహాలో కొత్త రకం శిక్షలు వేశారట. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి!

  • Loading...

More Telugu News