: బాలయ్య ఇంట మనవడి బారసాల సందడి!


టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిలో నిన్న బారసాల సందడి నెలకొంది. తన పెద్ద కూతురు బ్రాహ్మణి, లోకేశ్ దంపతులకు ఇటీవల పండంటి బాబు పుట్టిన సంగతి తెలిసిందే. మనవడి బారసాల కార్యక్రమం నిన్న బాలయ్య ఇంటిలో ఘనంగా, వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య కుటుంబంతో పాటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం, పరిమిత సంఖ్యలో బంధువులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News