: టీడీపీ బాటలో టీఆర్ఎస్... కార్యకర్తలకు బీమా చేయించిన కేసీఆర్!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్... తాను తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ బాటలో పయనిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల మాదిరే ఆయన తన పార్టీ కార్యకర్తలకూ బీమా చేయించారు. మొన్నటి పార్టీ సభ్యత్వానికి ముందు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త లోకేశ్, ఆ పార్టీ క్రియాశీల సభ్యులకు బీమా చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల బీమాకు సంబంధించి కేసీఆర్, ఈ-మెడ్ లైఫ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రమాదాల్లో మరణించే కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఒక్కో కార్యకర్తకు రూ.2 లక్షల బీమాను ఆయన చేయించారు. ఈ మేరకు నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో బీమా సంస్థకు రూ.4.64 కోట్ల ప్రీమియాన్ని కేసీఆర్ చెల్లించారు.