: క్లారిటీ ఉన్న దర్శకుడు సుధీర్ వర్మ: రాజమౌళి


సినిమా లేదా సన్నివేశం బాగా రావాలంటే దర్శకుడికి క్లారిటీ ఉండాలని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. 'దోచేయ్' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, దర్శకుడు సుధీర్ వర్మ పనిని చూస్తే క్లారిటీ కనిపిస్తుందని అన్నారు. సినిమా మీద ఎంత ప్రేమ ఉంటే అంత బాగా వస్తుందని రాజమౌళి చెప్పారు. సుధీర్ వర్మ గతంలో తీసిన 'స్వామి రారా' చూశానని అన్నారు. ఆ సినిమాను చాలా బాగా తీశారని ఆయన చెప్పారు. నిర్మాత భోగవల్లి ప్రసాద్ కు సినిమా అంటే ప్యాషన్ అని, సినిమాలు తీయడమే తప్ప, లాభాలు ఆర్జించాలని భావించరని ఆయన చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, పాటలు చూస్తే ఆ నమ్మకం కలుగుతోందని ఆయన చెప్పారు. నాగచైతన్య తన తండ్రిలాగే సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నారని, అలాగే ఆయన హిట్లు కొట్టాలని రాజమౌళి ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News