: మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట కుచ్చుటోపీ పెట్టిన 'మూన్ లైఫ్' ఆస్తుల జప్తు


మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరిట వందలాది మంది నుంచి వసూళ్లకు పాల్పడి అందినకాడికి దండుకుని కుచ్చుటోపీ పెట్టిన మూన్ లైఫ్ టీమ్ వర్క్స్ సంస్థకు చెందిన 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా జప్తు చేసింది. మూన్ లైఫ్ పేరిట నల్గొండ, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో భూములు, ఐదు బ్యాంకుల్లో 27 లక్షల రూపాయల డిపాజిట్లు, చందన రిసార్ట్స్ కు చెందిన మహబూబ్ నగర్, విశాఖపట్టణం జిల్లాల్లోని భూములను తాత్కాలికంగా జప్తు చేసినట్టు ఈడీ తెలిపింది. మూన్ లైఫ్ సంస్థ నిషేధిత గొలుసుకట్టు వ్యాపారం చేసి, తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని మోసగించింది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కోట్లాది రూపాయలు వసూలు చేసి, 2011లో బోర్డు తిప్పేసింది. దీంతో కొంత మంది ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు, 2012లో నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. దానిని ఆధారం చేసుకుని దర్యాప్తు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మూన్ లైఫ్ వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ మనీలాండరింగ్ కు పాల్పడినట్టు నిర్ధారించింది. మూన్ లైఫ్ పేరిట మోసపూరితంగా వసూళ్లకు పాల్పడి, ఆ మొత్తాన్ని చందన ఫార్మ్స్ కు బదిలీ చేసి, స్థిర చరాస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది. దీంతో ఈడీ ఆస్తులను జప్తు చేసింది.

  • Loading...

More Telugu News