: భారత్ లో వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమా మాదే!: 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' నిర్మాతలు
భారతదేశంలో వందకోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టిన తొలి హాలీవుడ్ సినిమాగా 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' నిలిచింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా 4006 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా భారత్ లో 2,800 స్క్రీన్లపై భారతీయ భాషలన్నింటిలోనూ డబ్బింగ్ తో రిలీజ్ అయింది. ఇంత ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ చివరి సినిమా కావడానికి తోడు, కథనం ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడమేనని యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి సరబ్ జిత్ సింగ్ తెలిపారు. తొలి వారంలో వంద కోట్ల వసూళ్లు సాధించి, 'అవతార్' సాధించిన 78 కోట్లను అధిగమించిందని పేర్కొన్నారు.