: అమితాబ్, అక్షయ్, దీపికాలను వెనక్కి నెట్టిన సన్నీలియోన్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హీరోయిన్ దీపికా పదుకొనేలను శృంగార తార సన్నీలియోన్ వెనక్కినెట్టింది. యూట్యూబ్ లో సన్నీలియోన్ తాజా చిత్రం 'ఏక్ పహేలీ లీలా' ట్రైలర్ హల్ చల్ చేస్తోంది. దీని ధాటికి స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లు వెనకడుగువేశాయి. అక్షయ్ తాజా సినిమా 'గబ్బర్ ఈజ్ బ్యాక్', అమితాబ్, దీపికల 'పీకు' సినిమాల ట్రైలర్లను వీక్షించిన వారి కంటే, సన్నీలియోన్ 'ఏక్ పహేలీ లీలా'సినిమా ట్రైలర్ ను వీక్షించిన వారే ఎక్కువని యూట్యూబ్ వెల్లడించింది. 'ఏక్ పహేలీ లీలా' ట్రైలర్ ను కోటి మంది వీక్షించినట్టు యూట్యూబ్ తెలిపింది. తరువాతి స్థానంలో గుల్షన్ దేవయ్య, రాథికా ఆప్టే నటించిన 'హంటర్' సినిమా, తరువాత 'బాంబే వెల్వెట్', అమితాబ్ ధనుష్ ల 'షమితాబ్' ట్రైలర్ ఉన్నాయని యూట్యూబ్ చెప్పింది.