: వెలుగు చూసిన ఐఎస్ తీవ్రవాదుల మరో కిరాతకం
రక్తపిపాసులుగా మారిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల దురాగతాలకు అంతులేకుండా పోతోంది. చెప్పిన మాట వినలేదనే కారణంతో పదిమంది వైద్యులను నిర్దాక్షిణ్యంగా కాల్చేసిన వైనం వెలుగు చూసింది. ఇరాక్ లోని మొసూల్ నగరంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు, స్థానిక గ్రూపులకు మధ్య పోరాటం జరుగుతోంది. దీంతో మొసూల్ పట్టణం తుపాకీ కాల్పులతో దద్దరిల్లుతోంది. గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స చేయాలంటూ ఉగ్రవాదులు స్థానిక వైద్యులను ఆదేశించారు. వారికి వైద్యం చేసేందుకు నిరాకరించిన పదిమంది వైద్యులను ఎడారిలో చేతులు విరిచికట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టి, తలలపై తుపాకులు ఎక్కుబెట్టి కాల్చేసిన ఘటనను అల్ సుమారియా శాటిలైట్ ఛానెల్ ప్రసారం చేసింది.