: కేసీఆర్ కి, వైగోకి దగ్గరి పోలికలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఎండీఎంకే అధినేత వైగోకు దగ్గరి పోలికలు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తాతల కాలంలో వలసలు వెళ్లిన వారేనని రికార్డులు చెబుతున్నాయని అంటున్నారు. ఆంధ్రాలోని విజయనగరం జిల్లా ప్రాంతానికి చెందిన కేసీఆర్ తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని, అదే భాష, యాసను అనుసరిస్తూ, అక్కడి వారిని ఆకట్టుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన యలమంచిలి గోపాలస్వామి (వైగో) తమిళవాదాన్ని భుజాన వేసుకుని, తమిళ భాషను ఒంటబట్టించుకుని, తమిళుడంటే ప్రాణం పెడతాడని పేరుతెచ్చుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఇంకో పోలిక కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ఇద్దరూ ఒక పార్టీలో చేరి, ఆ పార్టీ అధినేతలపై కినుక వహించి, వేరు పార్టీలు పెట్టుకున్నవారేనని చెబుతున్నారు. ఆంధ్రులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిస్తే, ఇప్పుడు వైగో ఆంధ్రాలో జరిగిన ఎన్ కౌంటర్ పై ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తానికి ఆంధ్రులే ఆంధ్రప్రదేశ్ కు శాపంగా మారడం శోచనీయమని అక్కడి వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News