: ఆ నేతలు కళ్లున్న అంధులు: మంత్రి ఈటెల
తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీ.కాంగ్రెస్ నేతలపై మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కళ్లున్నా చూడలేని అంధులని విమర్శించారు. నిజాన్ని చూడలేని, సత్యాన్ని గ్రహించలేని దద్దమ్మలని మంత్రి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఈటెల ధ్వజమెత్తారు. అలాంటి నేతలు తమపై విమర్శలు చేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలే తమకు అధిష్ఠానమని మంత్రి పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం అందజేస్తామని చెప్పారు.