: చిన్న దేశాలను చైనా బెదిరిస్తోంది: ఒబామా
దక్షిణ చైనా సముద్ర పరిసరాల్లోని చిన్న దేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. పనామాలో జరుగనున్న కరేబియన్ సదస్సులో పాల్గొనేందుకు జమైకా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక, అంగ బలంతో చిన్నదేశాలపై పెత్తనం చేయాలని చైనా ఆశపడుతోందని అన్నారు. దక్షిణ సముద్రంలోని అధిక భాగాన్ని తనదిగా చైనా క్లెయిమ్ చేసుకుంటుందని, దీనివల్ల ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర దేశాల ఎక్స్ క్లూజివ్ జోన్ లోకి చైనా చొచ్చుకెళ్తోందని ఆయన మండిపడ్డారు. దీని వల్ల భవిష్యత్ లో తీవ్రపరిణామాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.