: జైలు నుంచి ఉగ్రవాది లఖ్వీ విడుదల
26/11 దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్ కింద రూ.10 లక్షల విలువైన రెండు పూచీకత్తులను అతని తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించాడు. శాంతి భద్రతల పరిరక్షణ ఉత్తర్వుల కింద పాక్ లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం లఖ్వీని నిర్బంధించింది. ఈ ఉత్తర్వులను తాజాగా అతను కోర్టులో సవాల్ చేయడం, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో వెంటనే విడుదల చేయాలని లాహోర్ హైకోర్టు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.