: ఎన్‌ కౌంటర్‌ పోలీసులపై హత్య కేసు పెట్టండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


ఐదు రోజుల క్రితం తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన 20 మంది ఎర్ర చందనం దొంగల ఎన్‌ కౌంటర్‌ ఉదంతాన్ని హత్యకేసుగా నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సెక్షన్ 302 కింద నమోదు చేయాలని సూచించింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ ఉదయం ఎన్ కౌంటర్ ఘటనపై ఏపీ పోలీసులు నివేదిక సమర్పించగా, ఎదురు కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేశారా?... లేదా? అని కోర్టు ప్రశ్నించింది. కోర్టుకు ఇచ్చిన నివేదిక సరిగా లేదని వ్యాఖ్యానిస్తూ, పూర్తి వివరాలతో మరో నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News