: నా ఫెయిల్యూర్ కి, అనుష్కకు సంబంధమేంటీ?: వరల్డ్ కప్ సెమీస్ ఓటమిపై విరాట్ కోహ్లీ
వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఓటమిపై టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త ఆలస్యంగానైనా సూటిగా స్పందించాడు. అప్రతిహతంగా సాగిపోతున్న తరుణంలో సెమీస్ ఓటమి తనను కలవరపాటుకు గురి చేసిందని అతడు వ్యాఖ్యానించాడు. సెమీస్ లో తన ఫెయిల్యూర్ కు, తన గర్ల్ ఫ్రెండ్ అనుష్కకు సంబంధమేముందని కూడా అతడు ప్రశ్నించాడు. అయినా ఒక్క మ్యాచ్ లో విఫలమైనంత మాత్రానే నిందిస్తారా? అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో కోహ్లీ సింగిల్ పరుగుకే ఔటైన విషయం తెలిసిందే. మ్యాచ్ కు ముందురోజు అనుష్క శర్మతో చక్కర్లు కొట్టిన కారణంగానే కోహ్లీ విఫలమయ్యాడని మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. వీటిపై అతడు కొద్దిసేపటి క్రితం ఘాటుగా స్పందించాడు.