: చంద్రబాబు సర్కారుపై పోరుకు సిద్ధం: ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నవ్యాంధ్ర రాజధాని రైతులకు మద్దతుగా జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి రంగంలోకి దిగారు. రాజధాని కోసం భూములివ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని వినియోగించేందుకు ఏపీ సర్కారు యత్నిస్తే, ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. ‘‘ఈ రోజు మీడియా వార్తల ప్రకారం ఏపీ ప్రభుత్వం, రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఆ ఉద్దేశంతో ముందుకెళితే మటుకు నేను రైతులకు అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో పేర్కొన్నారు.