: గ్రూప్ వీడియో కాల్ సౌకర్యంతో రిలయన్స్ 'జియో చాట్'
మరో ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ 'జియో చాట్' భారత స్మార్ట్ ఫోన్ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని రిలయన్స్ జియో విడుదల చేసింది. ఈ యాప్ ను వాడుతూ గ్రూప్ వీడియో చాట్ చేసుకోవచ్చని, ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆధారిత స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తుందని తెలిపింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ నెట్ వర్క్ లో అయినా ఈ యాప్ కనెక్ట్ అవుతుందని వివరించింది. వాయిస్, వీడియో, కాన్ఫరెన్స్, మెసేజ్, ఇన్ స్టంట్ వీడియో, స్టికర్, డూడుల్స్ తదితర సౌకర్యాలు ఉన్నాయని రిలయన్స్ జియో తెలిపింది. కాగా, త్వరలో దేశవ్యాప్తంగా 4జి సేవలను అందించనున్న ఆర్ జియో ఇప్పటికే సుమారు రూ. 43 వేల కోట్లను ఖర్చు చేసింది.