: వైగో అరెస్ట్... అదుపులోకి తీసుకున్న వేలూరు పోలీసులు!
శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏపీ సర్కారుపై కత్తి దూసిన తమిళ పార్టీ ఎండీఎంకే నేత వైగో అరెస్టయ్యారు. శేషాచలం ఎన్ కౌంటర్ కు నిరసనగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ను రెండు వేల మందితో ముట్టడిస్తామని వైగో ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం వేలూరు చేరుకున్న ఆయన భారీ సంఖ్యలో అనుచరగణంతో వేలూరు కోట వద్ద ధర్నాకు దిగారు. అనంతరం భారీ ర్యాలీ వెంటరాగా చిత్తూరు బయలుదేరారు. అయితే కొద్దిదూరం రాగానే తమిళ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా వెళ్లడానికి వీల్లేదన్న పోలీసులతో వైగో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే ఆయనను వేలూరు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.